బాధ్యత:-కవిత వేంకటేశ్వర్లు


 చదువు చదవని 

వెంటబడకు

రేబవళ్లు పుస్తకాన్ని

పట్టమని చెప్పకు


పక్కింటి పిల్లలతో

పోల్చి చూడకు

బాగా ఇంకా బాగా

చదవమని వెంట బడకు


పిండి ఎంతో రొట్టె అంత

తెలివేంతో చదువంత

పిల్లలే కదా ఒత్తిడేందుకు

చిట్టి మనసుకు క్షోభ ఎందుకు


పెరిగే కొద్దీ బుద్ది పెరుగు

బుద్దితో జ్ఞానం మెరుగు

నేటి బాలలే రేపటి విద్యావంతులు

వాళ్లే మీ ఇంటి కాంతులు!!

                

                   

కామెంట్‌లు