అక్షరమాలికలు: --డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.


 ఏకపది:(ఊబకాయం)

*******

1.అతితిండి వల్ల ఉబ్బిపోయి_అసహ్యంగా కనబడే శరీరం.

2.క్రొవ్వులతో పెరిగి_అధిక బరువుతో అసహజంగా ఏర్పడే కాయం.

ద్విపదం:(వ్యాయామం)

********

1.ఒంటికి అవసరమయ్యే అత్యవసర అవసరం.

క్రమబద్ధ పద్ధతులతో చేసే సాధన.

2.శరీరావయవాలను పట్టుతప్పకుండా చూసే నిత్యకర్మ.

క్రొవ్వులను కరిగించి,ఆరోగ్యాన్నిచ్చే దినచర్య.

త్రిపదం:(అధికబరువు)

*******

1.అనవసర క్రొవ్వులతో పెరిగే శరీరభారం.

అధికాహారం వల్ల వృద్ధి చెందే క్రొవ్వుల కాయం.

సరియైన పోషకాలు లేక అడ్డదిడ్డంగా వృద్ధిచెందే అనవసరం.

2.అనారోగ్యకర ఆహారాలు,నూనెల వల్ల ఏర్పడే అసమతుల్యత.

అంతకంతకూ ఎక్కువయ్యే వ్యర్థాల కలబోత.

అనారోగ్యాల పెంపునకు దోహదకారి.

చతుర్థపదం:(బాల్యం)

***********

1.బాధ్యతలేని బంగారుమయమైన దశ.

స్వచ్ఛత,చురుకుదనాల కలబోత.

ఉత్సాహం,జిజ్ఞాసలతో నడిచే మధుర జ్ఞాపకం.

ఆటలతో,పాటలతో అలరారే తీయని అవస్థ.

2.చదువులతో,అల్లరితో సాగిపోయే జీవిత ముఖ్యదశ.

హాయిగా తల్లి ఒడిలో సేదతీరే ముఖ్యఘట్టం.

స్నేహితులు,చిరుతిళ్ళు,వినోదాలతో సాగిపోయే జీవనచక్రం.

ఆనందమే హద్దుగా,అవధులు లేని సుఖాల లోగిలి బాల్యం.