'' ఆ '' ఇద్దరు : -టి. వేదాంత సూరి
 రోజూలు గడుస్తూనే వున్నాయి, కాలం వేగంగా ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. చూస్తుండగా ఆరియాకు రెండేళ్లు పూర్తి అయ్యాయి. మూడో ఏడాది లోకి అడుగు పెట్ట పోతుంది. 
గత సంవత్సరం ఇక్కడే అంటే ఆక్లాండ్ లోనే వున్నాం , అనుకోకుండా, కోవిద్ వలన ఈ సారి కూడా ఇక్కడే ఉండటం ఒకింత ఆనందంగా వుంది. 
నిన్నంతా అమ్మ ప్రత్యేకంగా  కేక్ చేస్తూనే వుంది. పండుగ కదా లాంఛనాల మేరకు నానమ్మ కొన్ని సకినాలు, పాలకాయలు చేసింది. ఇవన్నీ చేసే సరికి అర్ధరాత్రి 12 దాటింది. ఆరియా  హాయిగా పడుకుంది. 
తెల్లవారి లేవగానే నాకు  ఆరియానే కనిపించింది. నన్ను చూడగానే నవ్వుతూ పరుగెత్తుకు వచ్చింది. హ్యాపీ బర్త్ డే టు  యు అనగానే దగ్గరికి వచ్చి హాగ్ చేసుకుని థాంక్స్ చెప్పింది. నన్ను బ్రష్ చేసుకోమని చెప్పి బయటకు పరుగెత్తింది . ఆరియా రోజంతా హడావిడిగా తిరుగుతుంది. ఆద్య ఆనందంగా ఆరియా వెంటనే తిరుగుతుంది. ఫోటోలకు పోస్ ఇస్తుంది. ఇక పొద్దున్నే యధావిధిగా గోదా కళ్యాణం ముగించాము, ఇక రాత్రికి పుట్టిన రోజు పార్టీ కి ఏర్పాట్లు చేస్తున్నారు . అందరూ సెలవు పెట్టడం వలన ఇల్లంతా సందడిగా వుంది. సండే లా అనిపిస్తుంది. తెల్లవారక ముందునుంచే, ఫోన్ లలో, వాట్స్ అప్ లో శుభాకాంక్షల సందేశాలు అందుతున్నాయి. 
(మరిన్ని ముచ్చట్లు రేపు)