బొమ్మలబండీ వచ్చిందీబొమ్మలు ఎన్నో తెచ్చిందీ
రంగుల బొమ్మలు ఉన్నాయీ
నాకూ అన్నీ నచ్చాయీ
పశువులు పక్షులు
మనుషులు కోతులు
ఉడుత కుందేలు
ఏనుగు గుర్రం
ఆవు ఎద్దు
సింహం నక్క
ఎన్నో జంతువులున్నాయీ
పనస అరటి
ఆపిలు అనాస
మామిడి సపోట
జామ సీతాఫలము
ఎన్నో ఫలాలు ఉన్నాయీ
బూర పీక
డప్పు కంజీర
కుర్చీ టేబుల్
వంటపాత్రలు
ఎన్నో బొమ్మలు ఉన్నాయీ
అన్నీ మనను పిలుస్తున్నాయీ
అన్నీ మనమే కొందామూ
హాయిగా ఆడుకుందామూ !!
బొమ్మలబండి: -- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి