ఆరోగ్యంగా ఉందాము:-అయిత అనిత--జగిత్యాల


 పచ్చాపచ్చని ఆకుకూరలు తిందాము

మనమంతా ఆరోగ్యంగా ఉందాము


తోటకూర మెంతికూర బచ్చలికూర చుక్కకూర

గోంగూర పాలకూర గల్జేరు పూదీనా

పచ్చాపచ్చని ఆకుకూరలు తిందాము

మనమంతా ఆరోగ్యంగా ఉందాము


బీరకాయ సోరకాయ దోసకాయ గుమ్మడికాయ

చిక్కుడుకాయ బెండకాయ కాకరకాయ పొట్లకాయ


తాజాతాజా కూరగాయలు తిందాము

మనమంతా ఆరోగ్యంగా ఉందాము


కందిపప్పు పెసరపప్ప శనగపప్పు మినుపపప్పు

అలసంద అనుములు బబ్బెర్లు బఠాణీలు

ప్రతిరోజు క్రమం తప్పక తిందాము

ఘనమైన పోషకాలను పొందుదాము


అరికెలు సామలు రాగులు ఉలవలు

కొర్రలు జొన్నలు అవిసెలు ఊశలు

చిరుచిరు సిరిధాన్యాలను తిందాము

కలకాలం ఆరోగ్యంగా ఉందాము