సోమరి రక్తం : -పుల్లామురళీ ఆకాశ్ఇంటర్ ద్వితీయ సంవత్సరం-గుంతకల్లు
 ఒక సోమరిపోతు మనిషి నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు రామన్.   అతడు తన రోజువారి పని చేసుకోలేనంత సోమరిగా ఉండేవాడు.రామన్  రోజు చేసే పని తినడం, పడుకోవడం మాత్రమే.
 బయటికి వెళ్లి ఏదైనా పని చేయొచ్చు కదా ! "ఏది ఇష్టమైతే అది చెయ్యి "అని అమ్నానాన్నలు చెప్పేవారు.
 కానీ రామన్ ఆ మాటలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ ఇష్టపడేవాడు కాదు .
ఒక రోజు రామన్ వాళ్ళ అమ్మ రామన్  మీద సింహంలాగా అరుస్తుంది.  కానీ రామన్ దాన్ని పట్టించుకోవడం లేదు. పైగా "అతనికి తినడానికి ఆపిల్ పండు కావాలి" అని అడుగుతున్నాడు.
 అనుకోకుండా రామన్న నాన్న ఇంటి లోపలికి వచ్చాడు. వస్తూనే అతని చేతిలో ఒక కట్టే తీసుకువచ్చాడు .అది ఒక పాము లాగ ఉంది .ఆ కట్టే రామన్  వైపుగా ఒంగుతోంది. ఇంట్లోకి అడుగుపెడుతూనే రామన్ ని కొట్టాడు. కట్టె దెబ్బ పడగానే రామన్ పడక గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు వేసుకొని  గడియ పెట్టుకున్నాడు .
రామన్ వాళ్ళ నాన్న గది వైపు చూస్తూ ఇలా అన్నాడు "బయటికి రా ! నా మాటలు నీకు అర్థం కావడం లేదా ?"ఎలా బతుకుతావో ఎమో..
 దీన్నీ అంతా గమనిస్తున్న వాళ్ళ అమ్మ భర్త వైపు చూస్తూ "శాంతం ..శాంతం.. శాంతంగా ఉండు . బుద్ది వస్తే వాడే మారుతాడు "అంది.
రామన్ వాళ్ళ నాన్న ఇంకా కోపంతో "రేయ్ నువ్వు బయటికి రాకపోతే నేను చంపుతా" అని కోపగించుకున్నాడు.
పడక గది బయట ఇంత గందరగోళం ఉంటే తాను మాత్రం సంతోషంగా నిద్రపోతున్నాడు. ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి .ఉదయం ఎనిమిది గంటలకు రామన్ టిఫిన్ చేసి పడుకోవడానికి పడక గదిలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు . అతను అనుకోకుండా ఒక చిన్నపాటి శబ్దం విన్నాడు.కానీ అది వినడానికి చాలా కష్టంగా ఉంది. ఆ మాటలు ఇలా ఉన్నాయి. "నాకు ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదు. నేను ఇల్లు వదిలి బయటకు పోతాను "అని ఒక ఎర్రపేను నల్లపేనుతో చెబుతోంది.
" ఎందుకు మిత్రమా ...!ఎందుకు నువ్వు ఈ ఇల్లు వదిలి బయటికి పోవాలి అనుకుంటున్నావు ? ఇక్కడ ఎంతో స్వచ్ఛమైన రక్తం రామన్  శరీరంలో ఉంది కదా! అది తాగడానికి చాలా అద్భుతంగా కూడా ఉంటుంది" అంది నల్ల పేను.
"  ఏమిటి  అది రక్తమా ? అది మనకు ఉపయోగపడదు. అది స్వచ్ఛమైనది కాదు. అతని రక్తం సోమరితనంతో కలిసి పోయింది .ఎప్పుడైతే మనం రామన్  మనం రక్తం తాగుతామో అప్పుడు మనం కూడా అతనిలాగే అయిపోతాం. అక్కడ చూడు అతను పొద్దున్నుంచి నిద్రపోతూనే నిద్రపోతూనే ఉన్నాడు "అంది ఎర్రపేను.
అతనికి తెలియడం లేదు. అతను స్వచ్ఛమైన రక్తాన్ని పోగొట్టుకున్నాడు .మనం ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడే మనం స్వచ్ఛమైన రక్తం పొందుతాము "అంది ఎర్రపేను.
"ఏమిటీ ? ఎలా? మనం పనిచేస్తే స్వచ్ఛమైన రక్తం పందుతామా ? "అని నల్లపేను అడిగింది.
  "ఇది నిజం మనం ఎప్పుడైతే పని చేస్తామో అప్పుడే మనం స్వచ్ఛమైన రక్తం పొందుతాము. మన శరీరంలో సోమరితనం వల్ల పనికిరాని చెత్త పదార్థం పేరుకుపోతోంది. అది మన శరీరం నుండి బయటకు పోదు.ఎప్పుడైతే మనం పని చేస్తామో  మన శరీరం చెమట ఉత్పత్తి చేస్తుంది. ఆ చెమట ద్వారా మనలోని మలినాలు బయటకు పోతాయి .అలా మన శరీరం బయటకు పంపిస్తుంది .కానీ అక్కడ చూడు రామన్ ఎప్పుడూ నిద్రలో ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఖచ్చితంగా రోగాల బారిన పడతాడు".అంది ఎర్రపేను.
ఒక్కసారి ఆలోచించు మనం ఆహారం కోసం వెతుక్కుంటూ పనిచేస్తాం .ఎప్పుడైతే ఆహారం దొరుకుతుందో అప్పుడే తింటాము .మనం మన శ్రమ అంతా మన పని కొరకు ఉపయోగిస్తాము.
 మనం ఒంటరి వాళ్ళం .మనకు కుటుంబం లేదు. తల్లిదండ్రులు లేరు. కానీ రామన్ కు తల్లిదండ్రులు ఉన్నారు .వారు ఇంకా బ్రతికే ఉన్నారు .అతని తల్లిదండ్రులు రామన్ సంతోషం కొరకు వారు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. చేతనైన పని చేసి బతికిస్తున్నారు. 
కానీ రామన్ అతని తల్లిదండ్రుల మాట వినటం లేదు. వారు పోయాక రామన్ ఎలా బ్రతుకుతాడో ఏమో అంది ఎర్రపేను.
అవును నువ్వు చెప్పింది నిజమే అతను చాలా సోమరిపోతు  అంది నల్లపేను.
రామన్ నిద్రపోతున్నట్లు నటిస్తూ ఎర్రపేను నల్లపేను  మాట్లాడుతున్న మాటలు విన్నాడు. ఇదంతా నిజమే కదా! ప్రేమపంచే అమ్మానాన్నలను పట్టించుకోలేదు .నేను ఇలానే ఉంటే కొద్ది రోజులకే  రోగాల బారినపడి చనిపోతాను అని పైకి లేవబోయాడు. 
రామన్ శరీరం కొన్ని కదలికలు కనిపించాయి.అతను వెంటనే పడక మీద నుంచి లేచి ఇంటి బయటకు వచ్చేశాడు.అతడి కాళ్ళు పని కోసం వెతుకుతున్నాయి .అతని కళ్ళు నీటితో మునిగిపోయాయి. ప్రపంచమంతా వెలుగు కనిపించింది.