వర్షం ఎలా పడుతుంది. ౼ దార్ల బుజ్జిబాబు

 సముద్రంలోని నీరు వేడికి ఆవిరవుతుంది. భూ వాతావరణంలో ఉన్న గాలికన్న  నీటి ఆవిరి తేలికగా ఉండటంతో పైకి ఆకాశంలోకి వెళ్లిపోతుంది. పైకి వెళ్ళాక  అక్కడ వాతవారణంతో కలిసి మేఘలుగా  మారుతుంది. ఆ మేఘం చల్లబడ్డాక మళ్ళి నీరుగా మారుతుంది. ఆ నీరే వర్షం రూపేణా భూమి మీద పడుతుంది. సముద్రపు నీరు వేడెక్కి అవిరిగామారి పైకి వెళ్లి చల్లబడి మళ్ళీ భూమిమీదకు చేరే ఈ ప్రక్రియనే నీటి చక్రం అంటారు. 
వర్షపు నీరు ఉప్పగా వుండవేం?
     సముద్రపు నీరు ఉప్పగా ఉంటాయి కదా? మరి వాన నీరు తియ్యగా ఎలా ఉంటాయి అనే సందేహం రావొచ్చు.  నీరు అవిరిగా మారేటప్పుడు కేవలం నీటి అణువులను మాత్రమే పైకి తీసుకు వెళుతుంది. నీటిలో ఉన్న లవణ మిశ్రమాన్ని ఇక్కడే ఉంచుతుంది. కాబట్టి వర్షపు నీటిలో ఎలాంటి లవణాలు ఉండవు.  మనకు లభించే నీటిలో వర్షపు నీరు మాత్రమే స్వచ్ఛమైన నీరు అనే విషయం మనం గ్రహించాలి.
కామెంట్‌లు