భవ్య భారతదేశం: - సత్యవాణి
 అందమైనది నా దేశం
భవ్యమైన సుందర భారతదేశం
వందకోట్ల జనావళితో
ఒప్పుతున్న అఖండభారత దేశం
గిరులూ తరులూ నదీ నదమ్ములు
మెండుగ కలిగిన నాదేశం
ఖనిజ సంపదలు ఘనమౌ అడవులు
అధ్భుత గుహలు అమరిన దేశం నాదేశం
పాడిపంటలు ప్రకృతి వనరులు
దండిగ కలిగిన నా భారత దేశం
గుడిగోపురములు, మసీదు చర్చిలు
మతఐక్యతను చాటే దేశం
పురాణ పురుషులు మునిపుంగవులు
నడయాడిన నా పవిత్ర దేశం
ఆదికావ్యాలు వేద స్మృతులు
వెల్లివిరిసిన నాభారతదేశం
సీతారాముల గీతాగానపు
ఘనతను చాటే నా దేశం
అరవైనాలుగు కళలతొ
అలరారే నా భారతదేశం
ఆర్యభట్టునూ శుసృత చరకులను గన్న విజ్ఞానగని నాభారదేశం
సివి రామన్ శకుంతలమ్మలే ఆదర్శంగా గల నాదేశం
బహుళార్థ సార్ధకమౌ సమున్నత
ఆనకట్టలను గలిగిన
 భవ్యమైనదీ నాదేశం
ఆధునిక సాంకేతి జ్ఞానమ
అందుకొన్నదీ  నాదేశం
లక్షల యువతకు లక్ష్యము
నేర్పిన 
సులక్షణదేశం నాదేశం
రోదసినౌకల కాదర్శము
గద 
ప్రపంచమందున నాదేశం
అధునాతన భవ్య భారతదేశం నాదేశం
కామెంట్‌లు