బాల సమీక్షకులకు ఆహ్వానం: డా.వరిగొండ సత్య సురేఖ


 వాఙ్మయి యూట్యుబ్ ఛానల్  మళ్ళీ పిల్లల సహకారం కోసం మీ ముందుకు వచ్చింది.  


బాలల సాహిత్యం పై విశేష కృషి జరుగుతోంది , ఇంకా ఎంతో జరగవలసి ఉంది . అయితే,   వారి గురించి వస్తున్న సాహిత్యం పై బాలల అభిప్రాయాలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  అందుకోసమే ఈ కార్యక్రమం.  దీనికి  తల్లిదండ్రుల సహకారం అత్యంత ఆవశ్యకం.  


** పాల్గొన్న బాలలకి ఈ- ప్రశంసా పత్రం (e- certificate) అందజేయబడుతుంది . 


నియమాలు: 


1.  వయసు 6 నుండి 15 సంవత్సరాల పిల్లలు . పదో తరగతి పిల్లలు 16 వత్సరాలు ఉన్నా పాల్గొనవచ్చు.

2. బాలలు తమకు నచ్చిన కథ / పుస్తకం / సంపుకథ / పుస్తకం / సంపుటి ఏదైనా సమీక్షకు తీసుకోవచ్చు.  

3. సమీక్ష వీడాయో తెలుగులోనే ఉండాలి. కాని ఎంచుకున్న  కథ / పుస్తకం / సంపుటి కి మాత్రం భాషా నియమం లేదు.

4. నిడివికి  నిబంధన లేదు. 


సమీక్ష చేసే విధానం. 


5. సమీక్ష చేసే బాలుడు / బాలిక ముందుగా తన గురించిన పరిచయం చేసుకోవాలి. 

     పేరు, వయసు, తరగతి, పాఠశాల పేరు, నివాస.    స్థలం, తల్లిదండ్రుల పేర్లు.

6. ఎంచుకున్న  యొక్క శీర్షిక , రచయిత పేరు, రచయిత గురించిన వివరాలు (వివరాలు అందుబాటును అనుసరించి) . 

7. ఆ  కథ / పుస్తకం / సంపుటి ఎందుకు ఎన్నుకున్నారు, అందులో నచ్చిన మరియు నచ్చని అంశాల వివరణ. టూకీగా ఆ  కథ / పుస్తకం / సంపుటి యొక్క వివరణ / వివరాలు.  


సాంకేతిక అంశాలు: 


8. వీడియో 16: 9 నిష్పత్తి లో ఉండాలి. 

9. శబ్దం స్పష్టంగా ఉండాలి. బయట శబ్దాలు సాధ్యమైనంత లేకుండా చూసుకోవాలి.  

10. వీడియో చిత్రీకరణ స్పష్టంగా, స్థిరంగా ఉండాలి. 


వీడియోలు 

vangmayichannel@gmail.com కి కానీ 

94906 70501 కి  whatsapp కి  కాని పంపవచ్చు.  


ధన్యవాదాలు.

డా.వరిగొండ సత్య సురేఖ