జై జవాన్ జై కిసాన్-- (కవిత)-వాసరవేణి విజ్ఞశ్రీ--10వ.తరగతి-సెల్:9492193437

 దేశ రక్షణ కోసం
నీ ఆలోచనలు నిరంతరం
కుటుంబాన్ని విడిచిపెట్టి
బార్డర్లో నివాసం
ప్రాణాలు లెక్క చేయక
శత్రువులతో ధైర్యంగా పోరాటం
ఎండ,వాన,చలికి బయపడనివైనం
జైజవాన్ సలాం సలాం
రోజు లేచినది మొదలుకునీ
పడుకునేవరకు పంటల ఆలోచనలే
పొలంలో ఎద్దులతో నాగలి దున్నుతూ
ఎండ,వాన,చలి అనక
వ్యవసాయం చేస్తూనే ఉంటావు
నీవు పండించే పంటలతో
ప్రజలతో పాటు పశ పక్షులు, కీటకాలు
ప్రాణులెన్నో తింటున్నాయి
నీకు తినడానికి తిండి లేకున్నా
ఇతరులకు తిండి పెడుతున్నావు
జై కిసాన్ సలాం సలాం
-వాసరవేణి విజ్ఞశ్రీ--10వ.తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బండలింగంపల్లి, గ్రా:సింగారం, మం:యెల్లారెడ్డిపేట, జిల్లా:రాజన్న సిరిసిల్ల,505305,