సాక్షి శతకము:-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్:9290061336

 దేవుని దరిశించంగల/
మానవుడెపుడైన మంచి మార్గము చేతన్/
కావు మనుచు వేడగనిటు/ 
లావొక్కింతయును లేదు రారా సాక్షీ//(109)
    
నీవే గతి నీవే మతి/
   నీవే అన్నిటికటంచు నమ్మిన  వాడన్/
    గావున సత్క్రప తోడను/
    బ్రోవుము  సర్వేశ్వరాయ భువిలో సాక్షీ//