తెలంగాణ పిల్లలం :-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.-సెల్,నెం.9491387977.


 మేం తెలంగాణ చిన్న పిల్లలం.

మా తెలుగు వెలుగు ఉన్న మల్లెలం 

తెలుగునాట పుట్టినట్టి వారలం 

వెలుగుతోట పెట్టినట్టి పోరలం‌


మా పిల్లల పండుగ బొడ్డెమ్మ

మా పెద్దల పండుగ బతుకమ్మ

ఈ రెండు పండుగలను జరిపిస్తాం 

ఇక మేమందరినీ మురిపిస్తాం.


మా ఇంటి ముందు పందిరి వేస్తాం

పుట్టమన్ను తో బొడ్డెమ్మను చేస్తాం

కలిసి మెలిసి ఆమెను పూజిస్తాం.

ఇల వెలసిన ఆ తల్లిని ప్రేమిస్తాం.


తంగేడు పూల బాస గుసగుసలు

కలువపూల కాంతులమిసమిసలు

తెలిసికొని సేకరించిన వారలం 

కలిసికొని సహకరించిన పోరలం 


మా బాలబాలికల ఓ బతుకమ్మా

నువు బయలుదేరి ఇక రావమ్మానీ

నీరాకకోసమై అంతా చూస్తున్నం 

నీ పూజకు సిద్ధం మేమౌతున్నం.


నీవు అనంత శక్తిస్వరూపిణివమ్మా

మాకు ముక్తి ప్రసాదించ రావమ్మా

మా తెలంగాణ బంగారూ బొమ్మా

మా మాగాణ సింగారం నీవమ్మా.


మా తెలంగాణ ఆటలను ఆడుతాం

మా మాగాణ పాటలను పాడుతాం

ఆటపాటలతో అందర్ని మెప్పిస్తం

నోటిమాటలతో వారిని ఒప్పిస్తం. 


మేం తెలంగాణ పోరు క్షతగాత్రులం

మామగాణ సేద్యంకోరుత్రినేత్రులం

కలిసి మెలిసి పోరు మేం సల్పినాం

ఇలన వెలసి మా పేరును నిల్పినాం