చిత్తుకాగితాల పిల్లలం:గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి--నాగర్ కర్నూలు జిల్లా.-సెల్,నెం.9491387977.

 చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలం

చిత్తు బొత్తు ఆటలాడు మల్లెలం

మేం ఊరు వాడ అంతా తిరుగుతం

పనికిరాని వస్తువులను ఏరుతం


ఊరి వీధీ వీధిలో తిరుగుతుంటం

భారి చీపురులను అమ్ముతుంటం 

డబ్బులను జేబులోన వేసుకుంటం

మబ్బుకు ముందేఇంటచేరుకుంటం


చీమిడి ముక్కుతో చిరిగిన చొక్కతో

నకనకలాడు మా పేగుల డొక్కతో

సందులన్నిమేంతిరుగు తుంటం

ముందే పందుల తరుముతుంటం 


చెత్తకుండీలలోనూ వెతుకుతాం

కొత్తకుండలోని గంజినీ గతుకుతాం

కుక్క బొక్క తిరుగుడే తిరుగుతాం 

చిక్కినడొక్కతో పక్కపై ఒరుగుతాం.


ప్లాస్టిక్ పైపులనూ వెతుకుతూ

ఎండకు వానకు మేం చితుకుతూ

మా బతుకు బండిని లాగుతుంటం 

మండే కడుపుతో మేం వేగుతుంటం 


సేకరించిన వాటిని అమ్ముతుంటం

సొమ్మిచ్చిన వారికి మోక్కుతుంటం

ఇంటి సరుకులు  తీసుకుంటం

వంటి కాపురం మేం చేసుకుంటం.


ఇలాంటి బతుకు ఎవ్వరికీ రావద్దు 

అలావస్తే వారు చితికి పోవడంకద్దు

ఆలోపేసర్కార్.సాయంచేస్తేముద్దు

అప్పడు అవుతుందిఈబతుకురద్దు


ఆదిశగా ప్రయత్నించాలి సర్కారు

అధికారులు చేయరాదు తాకరారు

ఎప్పుడు ఉండదు మాకు ఏఫికర్

అప్పడుఅంతా ఔతారులే బేఫీకర్.