భరత పుత్రుడా! (గేయ సూక్తులు): డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల- 9948089819


 అణువు అణువున పొంగి పొరలే

అహంకారము నణగ ద్రొక్కిన

జాతి యిచ్చును దివ్య హారతి

సదా నీకురా భరత పుత్రుడ! 77


మురికి దుస్తులు వేసికొన్నను

దరికి యెవ్వరు చేర నీయరు

చెడ్డ పలుకులు పలికి నంతనె

చెడును స్నేహము భరత పుత్రుడ! 78


 


కామెంట్‌లు