భరత పుత్రుడా! (గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819


 ఆంగ్ల భాషను నేర్చి పిమ్మట

ఆంధ్ర భాషను తిట్ట బోకుర

దేశ భాషల తెలుగు లెస్సని

మరచి పోకుర భరత పుత్రుడ! 83


శాంతి కోసము సమత కోసము

క్రాంతి కోసము సదా నడచిన

విమల భావము వెల్లి విరియును

వేయి వెలుగుల భరత పుత్రుడ! 84