పిల్లలు పిల్లల్ని జంతువుల్ని ఎందుకు ఇష్టపడతారు: - ప్రతాప్ కౌటిళ్యా-- Asst Prof in Bio-Chem (Retd)

 చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని జంతువుల్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే  ఏ జీవి అయినా శారీరకంగా మానసికంగా తమకు దగ్గరగా ఉండే జీవుల్ని ఇష్టపడడం మచ్చిక చేసుకోవడం జరుగుతుంది .  ప్రవర్తన  శారీరక భౌతిక స్వరూపము కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది.

 ఈ లక్షణాలు అనువంశికంగా కొనసాగుతూనే ఉండవచ్చును.

 మనసు వికసించని దశలో మానసికంగా మానసిక వికాసం లేనీవికసించని మానసిక జీవుల్ని ఇష్టపడని కూడా కారణం కావచ్చు దీనికి సమాధానం కేవలం మానసిక శాస్త్రం మాత్రమే కాక అనువంశిక శాస్త్రం చెప్పవచ్చు.

 పిల్లలు పిల్లల్ని ఇష్టపడటం లో కేవలం తమ తోటి తోటి జీవులుగాభావించడమే కాక , ఇన్నోసెన్సీ  కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆ దశలో అనువంశికంగా  ఉన్న లక్షణాలు అన్ని కాకపోవచ్చు కానీ కొన్ని లక్షణాలు ఎదుటివారిలో ఉండడం వల్ల తొందరగా  సెక్యూర్ గా ఫీల్ అయ్యి స్నేహానికి గాని పిల్లలు పిల్లల్ని ఎంచుకుంటారు.


  అలాగే పిల్లలు జంతువుల్ని  ఎందుకు ఇష్టపడతారు అంటే, ముందు మనిషి జంతువుల నుంచి పరిణామం చెంది, మానవుని గా పుట్టి,

 మనిషి గా మారి ఉండడం వలన మనకు జంతువులకు చాలా పోలికలు లక్షణాలు అలవాట్లు కూడా ఉండవచ్చు అంటే అనువంశికంగా  కొన్ని లక్షణాలు జంతువుల నుంచి   మనకు సంక్రమించీ ఉంటాయన్నమాట

 అందువల్ల మనిషి పుట్టినప్పుడు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు , పెరుగుతున్నకొద్దీ కూడా అనువంశికంగా ఉన్న జంతువు  లక్షణాల్ని అంతర్లీనంగా కలిగి ఉండి బాల్యంలో జంతువుల్నీ ఇష్టపడడం  సహజమేనని చెప్పవచ్చును.

 ముఖ్యంగా బాల్యంలో   జంతువుల లాగానే జీవిస్తాం. కనుక ఆ తర్వాత కూడా జంతువుల లక్షణాలు ఉండడం  సహజం కనుక బాలలు జంతువుల్ని ఇష్ట పడడం కూడా సహజమైన ప్రకృతి తీరు అని అర్థం చేసుకోవాలి!?!?


కామెంట్‌లు