తడిచెత్త-పొడి చెత్త: -- కందెపి రాణిప్రసాద్

 చిన్ను ఇలా రా అంటూ వంటింట్లోంచి నీరజ కేకేసింది. చిన్ను ఎక్కడున్నాడో పలకలేదు. మళ్లీ గట్టిగా కేకేసింది. ఏంటమ్మా అంటూ చిన్ను వంటింట్లోంచి పరుగెత్తుకు వచ్చాడు. నువ్వు తిన్న చాక్లేటు కాగితాలు ఎక్కడ పడేశావు. కోపంగా అడిగింది నీరజ. అదేంటమ్మా తిన్నాక డస్ట్ బిన్ లో వేయమని చెప్పావు కదా! అలాగే డస్ట్ బిన్ లో వేశాను అమ్మ  ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయ్యలేదు. చూడు ఈ డస్ట్ బిన్ లో అంటూ డస్ట్ బిన్లో పడేసిన చాక్లెట్ పేపర్లు తీసి చూపించాడు అమ్మకు
 ఆఫీసులకు స్కూళ్లకు టైం అయిపోతుందని హడావిడిగా వంట చేస్తున్న నీరజకు చిన్నిగాడి సమాధానం కోపం తెప్పించింది. డస్ట్ బిన్ లో వేశావు గానీ ఏడస్ట్ బిన్లో వేశావు ఇక్కడ రెండు రెండు డస్ట్ బిన్లు  ఉన్నాయి చూసావా అంటూ కోపంతో చిన్ని ఒక దెబ్బ వేసింది. వాడు ఏడుపు  మొదలెట్టాడు. ఆఫీసుకు తయారవుతున్న ఆనంద్ పరుగెత్తుకొచ్చి ఏంటి నీరజా పిల్లని కొడుతున్నావ్ నిదానంగా అర్థమయ్యేలా చెప్పాలి గాని అంటూ చెయ్యి పుచ్చుకుని మనం ఆ రూమ్ లోకి వెళ్దాం రా కన్నా అంటూ బెడ్ రూం లోకి తీసుకెళ్ళాడు.
 చాక్లెట్ రెపర్లు డస్ట్ బిన్లో వేశాక కూడా అమ్మ కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు చిన్నూ కు అదే ఆలోచిస్తూ నాన్న వెంట వెళ్ళాడు.ఆనందు చిన్నూ కు మరో రెండు చాక్లెట్లు ఇచ్చి కళ్ళు తుడిచి ఎత్తి మంచం మీద కూర్చోబెట్టాడు.
 చూడు చిన్నూ ఇంట్లో రెండు డస్ట్ బిన్ లు పెడుతున్నాo కదా! వాటిలో తడి చెత్త పొడి చెత్త అని వేరు చేయాలి రెండిటినీ వేరు వాటిలో వేయాలి నువ్వు చాక్లెట్ రేపర్లని  తడి చెత్త బుట్టలో వేశావని అమ్మ కోప్పడింది.
 చిన్ను కానీ తడి చెత్త అంటే ఏమిటి పొడి చెత్త అంటే ఏమిటి నాకు ఎలా తెలుస్తుంది అమ్మ నాకు ఏం చెప్పలేదు అన్నాడు రోషంగా
 చెప్పకపోవడం అమ్మ తప్పే కానీ నీ తప్పు కాదు కన్నా  అంటూ ఆనందు తడి చెత్త పొడి చెత్త గురించి వివరించ సాగాడు.
 కాగితాలు అట్టలు ప్లాస్టిక్ కవర్లు సీసాలు ప్లాస్టిక్ బాటిల్లు ధర్మకోల్ అట్టలు వంటివన్నీ పొడి చెత్త కిందికి వస్తాయి చిన్నూ. వీటిని పొడి చెత్త డబ్బులు వేయాలి. వీటిని రీసైకిల్ చేసి మరల పనికొచ్చే కవర్లుగా తయారు చేస్తారు. చెప్తున్నాడు ఆనందు చిన్నుకు ఎదురుగా కూర్చొని
 మరి తడి చెత్త ఏంటి నాన్నా అన్ని ఇందులో వచ్చేశాయి కదా! కుతూహలంగా అడిగాడు చిన్నూ
 వస్తున్నా అక్కడికే వస్తున్నా  నువ్వు అన్నం తిన్నాక ప్లేటులో కొంచెం వదిలేస్తావు కదా!
అలాగే బ్రేడ్ చివర్లు కూడా తినవు కదా నువ్వు అలాంటివన్నీ తడి చెత్త డబ్బులో వేయ్యాలి.అలాగే మిగిలిపోయిన అన్నం పప్పు ఆకుకూరలు అన్నీ అందులోనే వేయాలి ఇంకా అమ్మ కూరలు తరిగేటప్పుడు చాలా చెత్త వస్తుంది కదా అది కూడా తడి చేత్తల్లోనే వేయాలి. వీటిని ఒక చోట నిల్వ చేసి మొక్కలకు ఎరువుగా తయారు చేస్తారు దీంతో మొక్కలు బాగా పెరిగి పెద్దవవుతాయి అన్నాడు ఆనంద్.
 ఓ ఇన్ని విషయాలు ఉన్నాయా నాన్నా! చిన్నూ ఆశ్చర్యంగా అడుగుతూ ఇంతకు అమ్మ ఎందుకు కోప్పడింది అన్నాడు చిన్నూ.
 అరే చిన్ను చాక్లెట్ రాఫర్లు అంటే పొడిచెత్త కిందికి వస్తాయి కదా ముందట ఉన్న డస్ట్ బిన్ లో వెయ్యాలి కదా మరి నువ్వేమో వంటింట్లో డస్ట్ బిన్ లో వేశావు అంటే ఏమిటి చెప్పు అన్నాడు ఆనంద్
ఆ నాకు అర్థమయింది వంటింట్లో డస్ట్ బిన్ అంటే తడి చెత్త అన్నమాట కాగితాలు అందులో వేయకూడదు మిగిలిపోయిన అన్నం కూరలు మాత్రమే వేయాలి.ఉత్సాహంగా అన్నాడు చిన్నూ
అంతలో నీరజ కూడా బెడ్ రూమ్ లోకి వచ్చింది. మా చిన్నూ బంగారు కొండ ఇట్టే అర్థమై పోతాయి.
 అంటూ ముద్దు పెట్టుకుంది తల్లి కొడుకుల్ని చూసి ఆనంద మురిపెంగా నవ్వుకున్నాడు