అమ్మభాష- మణిపూసలు:-- ఎం.వి.ఉమాదేవి.


 అమ్మ భాషలో బోధన 

కమ్మనైన ఒక సాధన 

సాంకేతిక విద్య నైన

చెప్పగలుగు పరిశోధన 


సరళమైన అమ్మ భాష 

మనసులోని తెలివి ఘోష 

బయటపడే సాధనమే 

చదువవలెను సొంత భాష 


ఇతర భాష తెలియవలెను 

తెలుగుతోడ వెలుగవలెను 

విదేశీ భాషలతో 

మరింతగా ఎదగవలెను 


వేల ఏళ్ల నాటి భాష 

పల్లె పల్లె మురిసె యాస 

కడుపు నిండు మనసు పండు 

తన భాష లేక ప్రయాస !


తెలుగు బడికి శిశువు వెడలు 

ఇంగిలీసు చదువు మొదలు 

అగమ్యగోచరపు చదువు 

రెంటికి చెడిన రేవడులు