కోరినన్ని ఇస్తానూ: --: గంగదేవు యాదయ్య


 కోరినన్ని ఇస్తానూ 

కొబ్బరి కాయలూ

అడిగినన్నీ ఇస్తానూ

అరటి కాయలూ 

ఉన్నవన్నీ ఇస్తాను

ఉసిరి కాయలూ

దొరికినన్ని ఇస్తానూ

దోస కాయలూ..

కాసినవన్ని ఇస్తానూ

కాకర కాయలూ..

పండినవన్ని ఇస్తానూ

పనసకాయలు

కోసినవన్ని ఇస్తాను

కలిమె కాయలూ..

మక్కిన వన్ని ఇస్తానూ

మామిడి కాయలూ..

ఏరినవన్ని ఇస్తాను

వెలగ కాయలూ

మోసినన్ని ఇస్తాను

ముంజ కాయలూ

నచ్చినన్ని ఇస్తాను

నిమ్మ కాయలూ ..

కోరినవన్నీ ఇచ్చేదెవరూ..ఇచ్చేదెవరూ

కోరినవన్నీ తెచ్చేదెవరూ.. తెచ్చేదెవరూ..

కోరినవన్నీ ఇచ్చేదీ...

కోరి పెట్టిన తోట.

కోరినవన్నీ తెచ్చేదీ...

కోరి పెట్టిన చోట.. 

కుర్రో-  కుర్రు