తూరుపున వెలుగుచుక్కవేసెబాట ప్రభాతాన
నేలనింగి పరవశించి
పదము పాడి పలుకరించె
కాలుదువ్వు కలహాలు
చేయిచాచు విలయాలు
కొమ్మ చాటు ప్రణయాలు
కరిగెనింక వెలుగులోన
కాలమెంత గొప్పది
గుప్పెటలో దాగదది
సద్దుమణుగు స్వప్నమది
స్వప్నలీన రాగమది
వెలుగుబాట నడిచితిమా
వెలికివచ్చు ఊటబావి
మదిదాచిన మనోగతం
హృదిలోపలి రహస్యం
నడకపాట:--సి.యస్.రాంబాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి