ఉలుకు పలుకు లేని చిన్న పిల్లలంమూగతనం అనుభవించు మల్లెలంకూడు గూడు అసలు లేని బీదలంతోడు నీడ ఎవరు లేని అనాధలం.మూగతనం నిండుగాను మాకున్నమా నోటిమాట దండిగాను రాకున్నచదువుకోవాలని మాకుంది ఆశచదువు కొనలేక మిగిలింది నిరాశ.ఆశామషికాదు జీవితం అని గ్రహించాం అశేష అనుభవాల సారం కని సంగ్రహించాం గుట్టు తెలుసుకొని సాగినాం ముందుకుపట్టుబట్టి మా ఫలితం సాధించేందుకు.సర్కారు బడిలోనే దొరుకు కూడు గుడ్డ ఎర్కై వేసాం అందులో మేంఅడ్డ సిబ్బంది ఉండేటి మా మూగ బడి లో ఇబ్బంది లేకుండాచేరాం ఈ చదువుల గుడిలో.
మూగ పిల్లలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి