ఎగురుకుంటూ ఎగురుకుంటూ చాలా దూరం వెళ్ళింది. కొంత దూరం వెళితే తను పోవాల్సిన ఊరు వస్తుంది. ఇంతలో ఓ ఏనుగు వెళుతూ కనిపించింది. "ఎగురుతూ నా శక్తిని వృధా చేసుకోవడం ఎందుకు? ఈ యెనుగుపై ఎక్కితే పొలా? " అనుకుని రయ్యినా కిందకు దిగింది. దర్జాగా ఏనుగు పైకి ఎక్కి కూర్చుంది.ఏనుగు నడుస్తా ఉంటే కాకి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. ఏనుగు నడక కుదుపులకు కాకికి నిద్ర ముంచుకు వచ్చింది. కునుకుపాట్లు పడుతూ నిద్రపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి కీకారణ్యంలో ఉంది. ఆ ప్రాంతం ఏమిటో కాకికి తెలియదు. లేచి చుట్టూ చూసింది. దానికి భయం వేసింది. ఎటు పోతే ఏమి వస్తుందో కూడా తెలియదు. గాబరాగా దిగి పైకి ఎగిరింది. చుట్టూ పొదలు .ఎటు వెళ్ళాలో తెలియక ఏదో ఒక వైపులే అనుకుంటూ ముందుకి కదిలింది.ఎగురుతూ చాలా దూరం వెళ్ళింది. అలసట వచ్చింది. దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది. అది మంచి వేసవి కాలం కావటంతో చెరువులు ఎండిపోయి ఉన్నాయి. సమీపన ఉన్న గూడెంలోని ఓ తొట్టిలో అడుగున కాసిని నీళ్లుంటే వాటిని తాగి దాహం తీర్చుకుంది. ప్రయాణం సాగించింది. ఎంత దూరం వెళ్లిన తాను వెళ్ల వలసిన ప్రాంతం కనిపించలేదు.అక్కడున్న కాకుల్ని అడిగింది. అవన్నీ పగలబడి నవ్వాయి. "ఇంత దూరం వచ్చావేం. నీ వెళ్ళాల్సిన ఊరు దాటి చాలా సేపు అయింది. మళ్లీ వెనక్కు వెళ్ళు అని చెప్పాయి. అప్పటికే చీకటి పడటంతో ఆ రాత్రి అక్కడే ఉంది. తెల్లారి మళ్లీ వెనక్కు బయలు దేరింది.అది అలా బయలుదేరిందో లేదో పెద్ద గాలి వీచింది. ఎగరటానికి వీలు లేకుండా ఉంది. కాసేపటికి వాన పడింది. వానలో బయలు దేరటం కూడా కుదరలేదు. అష్టకష్టాలు పడి ఎలాగో ఆ ఊరు చేరింది. సింహం బంధువులకు పెళ్లి కబురు చెప్పింది. ఈ ప్రయాణంలో దాని ఒళ్ళంతా హూనం అయింది. గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంది. మరెప్పుడు ఇతరుల మీద ఆధారపడకూడదు అనుకుంది.నీతి: ఇతరుల మీద ఆధారపడకూడదు. మన శక్తి తోనే ఏ పనైనా చేసుకోవాలి.
కాకి కబురు.(బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి