నాట్యతార రాజసులోచన.:-- డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ .

 ఋగ్వేదంనుండి పాఠ్యము,సామవేదం నుండి గీతము,యజుర్వేదనుండి అభినయము, అధర్వణవేదంనుండి రసము,గ్రహించి,నాట్యవేదాన్ని సృష్టించారట.గీతమ్ ,వాద్యమ్ ,నృత్యమ్ ,అలేఖ్యమ్ అని వివరంగా ,వేలసంవత్సరాలకు పూర్వమే 'వాత్స్యాయనుడు( మల్లినాగుడు )మొదటిసారి చతుష్షష్టికళలను ప్రస్తావించాడు,పార్వతిదేవి వద్ద శ్రీకృష్ణుని మనుమడైన అనిరుద్దుని భార్య ఉషా నేర్చుకుని ,తనఅత్తవారిల్లయిన ద్వారకలోని రాచకన్యలందరికి నాట్యం నేర్పిందట.
నాట్యకళలోని (శాస్త్రాము)108 కరణములు చిదంబర దేవాలయంలో నేటికి చూడవచ్చు. శృంగారం,హాస్యం,కరుణ,రౌద్రం,వీరం,భయానకం,బీభత్సం,అద్బుతం,శాంతం,వీటిని మనం నవరసాలు గాచెప్పుకుంటాం.తమనాట్యంలో ఈరసాలన్నింటిని కలబోసి మెప్పిచిన సిని నాట్యతారామణులలో ఒకరైన 'రాజసులోచన' 1934ఆగస్టు 15 న విజయవాడలో భక్తవత్సలం,దేవికమ్మలకు జన్మించారు.బాల్యంనుండి సంగీతసాహిత్యాలపై మక్కువ చూపించడంతొ 'పంకజం'అనేసంగీత టీచర్ ను ఏర్పాటు చేసారు.వీరికుటుంబం మద్రాసులో స్ధిరపడటంతో ,చిట్టిబాబు గారివద్ద వయోలిన్ నేర్చుకుంటూ 'సరస్వతిగాన నిలయం'లో విద్యార్ధిగా చేరి డిప్లమో పొందారు.
అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎల్ .వెంకట్రామయ్యర్ ముఖ్యఅతిథిగా పాల్గోన్న హిందూ హైస్కూలు హాలులో తొలిసారి రాజసులోచన నృత్యప్రదర్మన చేసారు. అలాపలుప్రదర్మనలు చేస్తుండగా,సినిడాన్స్ మాస్టర్ రామ్మూర్తి ద్వారా గుబ్బికర్ణాటక ఫిలిమ్స్ వారునిర్మించే 'గుణసాగరి'అనేకన్నడ చిత్రంలో కథానాయకి పాత్రవచ్చింది.ఆమె ఇంట్లో వారికి యిష్టంలేక పోయినా ఆచిత్ర నిర్మాత గుబ్బివీరన్న అందరిని ఒప్పించాడు.
1945 లో ప్రారంభమైన ఆచిత్రం1953 నాటికిపూర్తి అయింది.అంతకుముందుగానే తెలుగు దర్మక,నిర్మాత కె.ఎస్ .ప్రకాశరావు తనునిర్మించే 'కన్నతల్లి'(1953)చిత్రం లో నృత్యం చేసే అవకాశంకలిగించారు.(ఈచిత్రంద్వారానే గాయని పి.సు శీల పరిచయంజరిగింది) అలా 'అంతామనవాళ్ళే' 'కాళహస్తీశ్వరమహత్యం'(1954) 'చెరపకురాచెడేవు'(1955) 'సోంతవూరు' -'పెంకిపెళ్ళాం'(1956) 'రేపునీదే'- 'తోటికోడళ్ళు' ''సారంగధర'(1957)'పెళ్ళినాటిప్రమాణాలు (1958)' మాంగళ్యబలం'-జయభేరి'(1959)' భాగ్యదేవత'- 'శాంతినివాసం'-'రాజమకుటం'-'మహాకవికాళిదాసు'-(1960)'ఇద్దరు మిత్రులు'-'వెలుగునీడలు'-                         'శెభా ష్ రాజా'(1961) 'ఖైదికన్నయ్య'(1962)' చదువుకున్నఅమ్మయిలు'-'వాల్మీకి'(1963) ఇంకా తమిళంలో ఎం.జి.ఆర్ . శివాజిగణేషన్ . మళయాళంలో ప్రేమ్ నజీర్ .కన్నడంలో రాజకుమార్ వంటి పలువురుకథానాయకులతో నటించారు. హిందీలో 'భాహార్ ' 'నయాఆద్మి''చోరిచోరి' 'సితారోంసేఆగే'వంటిచిత్రాలలో నటించారు.
నటిగా ఎన్నిపాత్రలుచేసినా ,ఆమెకుమానసికతృప్తిని ఇచ్చేవి బహిరంగనృత్యాలే. సినిమాల్లోనటిస్తూ, కూచిపూడి,కథాకళి,కథక్ ,భరతనాట్యంవెస్ట్రన్ నృత్యం తోపాటు,ఇటు లక్నోశైలి-అటుజైపూర్ శైలి ఒకేసారి నేర్చుకున్న మెదటి కళాకారిణి ఈమె. తనునేర్చిన నృత్యాన్ని పదుగురికినేర్పాలని (1962)లో మద్రాసునగరంలో 'పుష్పాంజలి'అనే నృత్య కళాకేంద్రాన్ని ప్రారంభించారు.1963 లో గురువాయూరులో ప్రముఖ సినీ దర్మకులు సి.యస్ .రావుగారిని వివాహంచేసుకున్నారు.  ఆయనకు అప్పటికే కడారునాగభూషణం-కన్నాంబ దంపతుల పెంపుడు కుమార్తెతో వివాహం జరిగి ఇద్దరు బిడ్డల తండ్రిగాఉన్నారు.ఆయన దర్మకత్వంలో 'ప్రచండభైరవి'(1965) 'గ్రామదేవతలు'(1968)'మామకుతగ్గకోడలు'-'ఏకవీర'(1969) ఇలా పలురకాలపాత్రలుధరిస్తూ 300 చిత్రాల మైలురాయిని దాటారు.
నటిసావిత్రి దర్మకత్వంలో 'చిన్నారిపాపలు'(1968) చిత్రానికి నృత్యానికి దర్మకత్వంవహించారు. తమిళనాడు ప్రభుత్వం'కలైమామణి'బిరుదుతో ఘనంగా సత్కరించింది.' పాండవవనవాసం (1965)చిత్రంలో 'ఉరుకులపరుగులదొల'పాటకు ఆమెచేసిన నృత్యాభినయం అజరామరం. 'వెలుగునీడలు'(1961) చిత్రంలో 'పాడవోయిభారతీయుడా'పాటలో కూర్చున్న భంగిమలో రెండేసిమెట్లుఒక్కసారిగా ఎక్కుతూ చేసేనృత్యంఅమోఘం.'రాజమకుటం'(1960)చిత్రంలో'సడిసేయకోగాలి' పాటలో అభినయాన్ని, ఆనందాన్ని అందరకు పంచిన ఈమె తన 78 వఏట 5-3-2013 న బ్రహ్మలోకం పయనించారు.
కామెంట్‌లు