వ్రతము:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 టీవీవచ్చిందీ టీవీవచ్చిందీ

మాఇంటికి టీవీవచ్చిందీ

మాఇంటికి ఠీవీవచ్చిందీ

అప్పటినుండీ ఇప్పటిదాకా

అమ్మానాన్నల మాటలు బందూ

పిల్లల ఆట పాటలు  బందూ

వచ్చిన చుట్టాల నోరులు బందూ

నేస్తాలైనా మూతులు బందూ

తాతామామ్మల మౌనవ్రతమూ

అమ్మాఅక్కల మౌనవ్రతమూ

వంటగదికీ మౌనవ్రతమూ

అన్నిటి మూలము టీవీవ్రతమూ !!