డాల్ఫిన్ చేపలు - (బాల గేయం );---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు.


 డాల్ఫిన్ చేపల డాన్సులంటే 

పిల్లలు పెద్దలకెంతో ఇష్టం !

నీటిలోని ఆ విన్యాసాలు 

చూస్తూఉంటే అబ్బురం!


మనుషులు అంటే ఇష్టంచాలా 

దగ్గరకొచ్చి గంతులు గోలా 

త్రుళ్ళి త్రుళ్ళి పడుతుంటాయి 

కళ్లలో మెరుపు కలిగిఉంటాయి


మాటలురాని నేస్తం డాల్ఫీన్ 

ఆటల్లోన దోస్తుగ డాల్ఫీన్ 

బంతితో ఆట ఆడుతుంది 

అంతలో నీళ్ళలో దూకుతుంది!