సోయగము రూపకర్త: --ధనాశి ఉషారాణిచిత్తూరు జిల్లా భాకరాపేట


 బుట్టను చేతిలో పట్టెను

పొట్ట మాడ్చు కుంటు

ముచ్చట పడుతూను చల్లేరు

పచ్చ చేను లోన

ఏరువాకనుచూసి మురిసేరు

ఎరువు లన్ని చల్లి

సోయగ మందు మురిసి


 పశువుల పండగ నందున

కశువు పెట్టి మురిసి

పంటలు ఇంటికి చేరిన

కంటి నిండు గాను

సంతోషదనములో మురిసేను

సంబరమున నిలిచి

సోయగముద్దుల బిడ్డరా


అమ్మలా మురిసెను కమ్మగ

బొమ్మ వలెను నిలిచి

కటిక చీక టoదు

పటికపు బెల్లము విందున

ముద్దు గాను మురిసి

హద్దులు లన్నియు చెడుపుతూ

సొగసుల సోయగములతోను