చెడుపై మంచి విజయం సాధిస్తుందని చెప్పడానికి ప్రతీకగా భారత్ లో జరుపుకునే పండుగల్లో హోలీ ప్రత్యేకమైంది. వసంత ఋతువు ప్రారభమవుతుంది చెప్పడానికి గుర్తుగా ఈ వేడుకలు చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా హోలీ జరుపుకుంటారు. మా ప్రాంతంలో హోళీ వేడుకలను పెద్ద వాళ్ళ కంటే, చిన్నవాళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఒక పెద్ద తాడు సహాయంతో చిన్న పిల్లలు రోడ్డు అటు, ఇటూ వైపులా ఉండి వాహనాలను అపి డబ్బులు అడుగుతూ.. ఇయనివారిపై రంగులు చల్లుతూ ఘనంగా జరుపుకుంటున్నారు. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం...
ఉత్తరప్రదేశ్ లోని బర్శానా గ్రామంలో మహిళలు కర్రలతో పురుషులను కొట్టడం హోలిలో భాగమే. ఆ సమయంలో పురుషులు తమను, తాము. ఎవరికైనా ఆ కర్రలు తాకితే.... ఆ పుర్షుడు స్త్రీ లాగా ముస్తాబై విధుల్లో డాన్స్ చేయాలి. ఈ రకమైన హోలీని లత్ మార్ హోలీ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్ లో వసంతఋతువును. సంగీతం, నృత్యాలతో ఆహ్వానిస్తూ బసంట్ ఉత్సవను జరుపుకుంటారు. రాధాకృష్ణులు తిరిగి కలుసుకున్న నేపత్యంలో వారి విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ.. అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడి జనం హోలీ పండుగను బాసంట్ ఉత్సవ్ / డోల్ జత్ర / డోల్ పూర్ణిమ అని పిలుచుకుంటారు. రంగు పంచమిని మహారాష్ట్రా,. భిహర్, మధ్యప్రదేశ్ తో పాటు ఉత్తరభారతంలో ని కొన్ని ప్రాంతాల్లో రంగు పంచనిని ఘనంగా జరుపుకుంటారు. హోలిక దహనం చేసిన ఐదో రోజున రంగులు చల్లుకుంటూ హోళీ చేసుకుంటారు. గోవాలో వసంతఋతువు లో జరుపుకునే హోలినే షిగ్మో అంటారు. స్థానిక రైతులు జానపద గేయాలు పాడుతూ, నృత్యం చేయడం ఈ వేడుక ప్రత్యేకత. ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంప్రదాయ వేడుకలు చేస్తూ... ర్యాలీలు చేపడుతారు. మణిపూర్ లో హోలీని ఆరు రోజులు జరుపుకుంటారు. దీన్ని యాసంగ్ అని పిలుస్తారు. ఈ పండుగ సమయంలో ప్రజలు సంప్రదాయ నృత్యాలతో తబల్ చొంగ్బా చేస్తూ వేడుకలు చేసుకుంటారు.
రాజస్థాన్ ఉదయ్ పూర్ లో రాయాల్ మేవార్ కుటుంబ వారసుల తో ఇక్కడి స్థానికులు. రెండు రోజుల పాటు హోలీ వేడుకల్లో పాల్గొంటారు. రాజ కుటుంబం బోన్ మంటలను వెలిగిస్తుంది దాని తరువాత స్థానిక ప్రజలు హాలిక దహన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఉత్తర భారతదేశం తో పోల్చుకుంటే.. దక్షణాది రాష్ట్రాల లో ఈ హోలీ వేడుకలు తక్కువగానే జరుపుకుంటారు. ఏది ఏమైనా హోళీ పండుగ వేడుకలు రంగులతో జరుపుకుంటారు.
ఇది ఇలా ఉంటే... కోవిడ్-19 నిబంధనల కారణంగా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హోలీని నిషేధించాయి. అవి ఏంటంటే ఉత్తర ప్రదేశ్, బీహార్, ఒడిస్సా, గుజరాత్, ఢిల్లీ లతో పాటు మరి కొన్ని ప్రాంతాలు హోలీని నిషేధించాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి