అదృష్టం -దురదృష్టం:--గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-నాగర్ కర్నూల్ జిల్లా.సెల్ నెంబర్.9491387977.

 రామాపురంలో రఘు ,రవి ,రాజు అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. రఘు ,రవిది ఒకే మాట., ఒకే బాట. చిన్నవాడైన రాజు పద్ధతి మాత్రం వేరు. పెద్ద వారిద్దరూ తండ్రి మాట వినే వారు కాదు. ఎప్పుడు ఎవరితోనో ఒకరితో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ గ్రామంలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. చిన్నవాడైన రాజు తండ్రి మాట వింటూ గ్రామంలోని వారందరితో కలివిడిగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా తండ్రికి అనారోగ్యం సంభవించి ఓ రోజున మంచాన పడ్డాడు. పెద్ద వారిద్దరూ తండ్రిని అసలు పట్టించుకోలేదు. పాపం చిన్న వాడి పైనే తండ్రి బరువు బాధ్యతలు పడ్డాయి.

          ఈ పరిణామాలన్నీ గమనించి తండ్రి ఒక నాడు గ్రామ పెద్దల సమక్షంలో తనకున్న మూడు ఎకరాల పొలం ను ముగ్గురు కుమారులకు పంచి అంతా కలిసి మెలిసి గ్రామంలోని వారితో సఖ్యతగా మెలగండని చెప్పి కన్నుమూశాడు. చిన్నవాడు రాజు తనకొచ్చిన ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటూ అందరితో కలిసి ఉంటూ తండ్రి మాట నిలబెట్టాడు. పెద్ద వారిద్దరూ తమ కులాన్ని అమ్ముకొని జల్సా గా కాలం గడుపుతున్నారు. డబ్బు హారతి కర్పూరంలా హరించుకుపోయింది. బతుకు వారికి భారమై పోయింది. గత్యంతరం లేక చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డారు. అలవాటు ప్రకారం గా ఒకరోజు ఆ గ్రామమునసబు ఇంటికి దొంగతనానికి వెళ్లి గోడదూకబోయి రఘు కాళ్లు పోగొట్టుకోగా, మరో ప్రమాదంలో రవి కళ్ళు పోగొట్టుకున్నాడు. కుంటి, గుడ్డిగా మారినవారు రు బతుకు తెరువు కై బిచ్చగాళ్ళు అయ్యారు.
       గుడ్డివాడి భుజాలపైకుంటివాడు కూర్చొని ఇంటింటికి మార్గం  చూపిస్తుండగా ఆ గ్రామం అంతా తిరిగి అడుక్కునే వారు. ఇలా ఒక రోజు ఇల్లిల్లు తిరుగుచుండగా ఆకాశమార్గాన శివపార్వతులు వారిని చూశారు.
      అప్పుడు పార్వతీదేవి"నాథా! కళ్ళు కనిపించక ఒకడు, నడవలేక మరొకడు, పొలంలో పంట పండక వారి సోదరుడు  అనేక కష్టాలు పడుతున్నారు. వారిని కనికరించి కాపాడలేవాస్వామీ"అంది.
         అప్పుడు శివుడు"చూడు పార్వతీ"ఎవరి పాప ఫలం వారు అనుభవించక తప్పదు. వారు చేసిన కార్యాలే వారి జీవన విధానాన్ని తీర్చిదిద్దుతాయి. దేవతలమైన  మనము ఏమి చేయలేం."అన్నాడు.
     మీరు అనుగ్రహించి చూడండి అని పార్వతి కోరగ "సరే చూడు ఇప్పుడే నగల మూటను వారి ముందు పడేస్తున్న అంటూ శివుడు నగల మూటను పడేశాడు. దభీమన్న శబ్దానికి గుడ్డివాడు భయపడి"ఏమిటి ఆ శబ్దం? అని కుంటి వాడిని ప్రశ్నించగా"పాడుపడిన ఇంటిపై నుంచి ఏదో ఒక మూట మన ముందు పడింది. అని బదులిచ్చాడు. వెంటనే గుడ్డివాడు
"పాడుపడిన భవనము నుండి పడింది కాబట్టి ఇది ఖచ్చితంగా దయ్యాల పనే. ఇక మనం ఇక్కడ ఉండరాదు. వెళ్లి పోదాం పద"అన్నాడు. వెంటనే అక్కడి నుంచి చి ఆ మూటను తాకకుండానే ఇద్దరు వెళ్ళిపోయారు. "!చూసావా దేవి! అనుగ్రహించి ధనం మూటను వారి ముందు పడేసినా ఆరు దాన్ని తీసుకోక వెనక్కి వెళ్లిపోయారు. దురదృష్టవంతులను బాగు చేసే వారు లేరు. అదృష్టవంతులను చెడగొట్టే వారు లేరు అని ఊరికే అనలేదు. అన్నాడు శివుడు.
  శివుడు చెప్పిన మాట విని పార్వతి"వీరిద్దరి దశ ఇలా జరిగింది. మరి చిన్నవాడైన రాజు పరిస్థితి ఏంటి? అనగా"దేవి ఇంకాసేపట్లో వస్తావుగా అంటుండగానే ఆ గ్రామ చెరువుకు గండి పడి నీటి ప్రవాహం ఉరకలేస్తూ వచ్చి నగల మూటను తీసుకెళ్లి రాజు పొలం లో పడేసింది.
      చిన్నవాడైన రాజు పొలంలో లో నిలిచిన నీళ్లను చూసి వెంటనే ఎంతెంతో నీళ్లను తోడే యోగా ఆ నగల మూట అతని కంట పడింది.
విప్పి చూశాడు. నగలను చూసి ఆశ్చర్యానికి లోనై వెంటనే మూటను ముడేసి"ఇది భగవంతుడు నాకు ప్రసాదించిన వరం అని మనసులో ఆ శివుణ్ణి తలుచుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ గ్రామంలో శివాలయాన్ని నిర్మించి ఆ గ్రామ ప్రజల మెప్పును పొందాడు. ఓ చక్కని చుక్క ను వివాహమాడి భార్యా పిల్లలతో సుఖంగా జీవించాడు.