నిడుముక్కల సుబ్బారావు.వేదికనుండి-వెండితెరకు.: - డా.బెల్లంకేండనాగేశ్వరరావు. 9884429899.


 


క్రీ.శ.11 వ శతాభ్ధంలో వల్లభరాయుడు 'క్రీడాభిరామము'అనే సంస్కృత వీధి రూపకాన్ని, 'క్రిడాభిరామము'పేరున తెలుగులోకి అనువాదించారు.

ధార్వాడ నాటక సంస్ధ ప్రభావంతో నాటకరంగ అభిమానులు తెలుగునేలపై పలుప్రాంతాలలో నాటకసమాజాలు పుట్టుకువచ్చాయి.అలా బెజవాడలో కాశీనాధునిమల్లయ్య, కారుపర్తి నాగలింగం,సుబ్బయ్యనాయుడుగార్లు మరికొందరు కళాభిమానులు కలసి హిందూధియోర్ స్ధాపించి, బోబ్బిలియుధ్ధం,తారాశశాంకం,హరిశ్చంద్రా ఇత్యాది నాటకాలు ప్రదర్శిస్తుండేవారు.

అదేసమయంలో బాలభారతి నాటక సమాజం మైలవరం జంమిందార్ గారు శ్రీసూరానేని వెంకటపాపయ్య రావుబహద్దురు ఈనాటక సమాజ పోషకులు.ఈసంస్ధలో యడవల్లి సూర్యనారాయణ, ఉప్పులూరి సంజీవరావు,అద్దంకి శ్రీరామమూర్తి, కపిలవాయి రామనాధశాస్త్రి, పారుపల్లి సుబ్బారావు,గురజానాయుడు వంటి సుప్రసిధ్ధ రంగస్ధలనటులు ఉండేవారు.నిడుముక్కల సుబ్బారావుగారిని నాటకరంగానికి పరిచయం చేసింది ఈసంస్ధే.సుబ్బారావుగారు పది సంవత్సరాలు ఈసంస్ఢలో ఉండి పలురకాలపాత్రలు ధరించి రంగభూషణ,నాటవిశారదా బిరుదులు పొందారు.

సుబ్బారావుగారు బాల్యంలో బందరు లో ముత్తరాజుసుబ్బారావుగారు స్ధాపించిన చిత్రకళాభివర్ధని సంస్ధలో బాలవేషాలు ధరించేవారు. అనంతరం,శానిటరీఇన్ స్పెక్టర్ ఉద్యోగంచేస్తూకూడా నాటకరంగానికి తనవంతు సేవలు అందించారు.

అలా దేశం అంతటా నాటకప్రదర్శనలుఇస్తూ రంగూన్ లొ పలుప్రదర్శనలు ఇచ్చారు. దేశోధ్ధారకనాగేశ్వరరావుగారిచే నూటయాభై రూపాయల నగదు. నిజాంమంత్రికృష్ణప్రసాద్ గారు నూటముఫైమూడు వెండిరూపాయలు, బంగారుకాసు,కాశ్మీరు శాలువా బహుకరించారు.వల్లూరి జమిందార్ గారు ఘనంగా వీరిని సత్కరించారు.

సుబ్బారావుగారు వెండితెరకు వచ్చి 'రుక్మిణి కల్యాణం'(1937)చిత్రంలో శిశుపాలుడిగా,'పాశుపతాస్త్రం'(1939)చిత్రంలో అర్జునుడిగా,'సతీసావిత్రి' (1957)చిత్రంలో సత్యవంతుడిగా నటించారు.హిజ్ మాస్టర్స్ ,సన్ రికార్డింగ్ కంపెనీలలోముఫై అయిదు గ్రాంఫోన్ రికార్డులు విడుదల అయ్యాయి.1956 భార్యా వియోగం జరిగింది.1960 లొ తణుకులో ఆంధ్రానాటకకళాపరిషత్తు వారు సుబ్బారావుగారిని ఘనంగా సన్మానించారు.దాదాపు నలభై సంవత్సరాలు కళారంగానికి సేవలు అందించినవీరు తన డెభై అయిదవ ఏట కళామతల్లి పదసేవకు తరలివెళ్ళారు.