నా పాట:- డాక్టర్. కొండబత్తినిరవీందర్--కోరుట్ల. జిల్లా:జగిత్యాల 9948089819
ఓ మనిషీ! ఓహో!మనిషీ
మానవతను నిలుపుకొనే
మాటవిను-నా
పాటవిను

మనసులలో పెరుగుతున్న
విభేదాలు మాయాలి
మనమంతా ఒక్కటనే
మహితగుణం రావాలి

గుండెలలో రగులుకొనే
ద్వేషాగ్నుల నార్పాలి
సాటి మనిషి నాదుకొనే
తేట మనసు కోవాలి

పదవులకై ఆశపడే
పాడుబుద్ది వదలాలి
ప్రేమధనం త్యాగ గుణం
విశ్వమంత పంచాలి