ఏకపది:(పరీక్ష)
*******
1.అభ్యసించిన జ్ఞానాన్ని.....పద్ధతిగా మదింపుచేయడానికి సాధనం!
2.విషయపరిజ్ఞానాన్ని వివిధ పద్ధతులతో......చేసే మూల్యాంకనం!
ద్విపదం:(ఫలితం)
********
1.చేసిన ప్రయత్నం సఫలం కావడం.
కృషికి తగిన గుర్తింపు రావడం.
2.తీవ్రపరిశ్రమ అనంతర విజయం.
అభ్యసనం ఫలించి ఆవిష్కృతమయ్యే దృశ్యం.
త్రిపదం:(గోరింట)
*******
1.కొమ్మ లేకుండా పూచి శుభాలనిచ్చేది.
స్త్రీల చేతుల్లో పండే సౌభాగ్యం.
ఇష్టమైన వారి సంకేతమిచ్చే అరుణిమ.
2.ఆషాఢమాసాన విశిష్టంగా కనిపించి కనువిందుచేస్తుంది.
అన్ని వేడుకల్లో అగ్రభాగాన నిలుస్తుంది.
అందాన్ని ద్విగుణీకృతం చేసే అలంకార సాధనం.
చతుర్థపదం:(శ్రావణమాసం)
***********
1.శ్రవణా నక్షత్రంతో కూడిన శ్రీమన్నారాయణుడి మాసం.
వ్రతాలకు,పూజలకు,ఆరాధనలకు శుభప్రదమైనది.
పేరంటాలతో మురిసి మెరిసే పవిత్రమాసం.
శివకేశవుల,అమ్మవారి ఆరాధనలతో నడిచే తెలుగువారి ప్రత్యేకం.
2.పెళ్ళిళ్ళు,ముహూర్తాలతో ముఖ్యమవుతుంది.
వర్ష ఋతువుతో మొదలై చిరుజల్లుల వర్షాలతో మురిపిస్తుంది.
రక్షాబంధన ప్రేమలను మోసుకొస్తుంది.
నాగపూజ ప్రత్యేకమై విరాజిల్లుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి