పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ
పొలాలనే మెచ్చునమ్మ
బుజ్జి పొట్ట నిండుగాను
గింజలుతిని ఎగురునమ్మ!
వారెవ్వా పిచ్చుకలు
ప్రకృతిలో చిరు పిట్టలు !
ఇవి రెండు రకాలుండును
పెద్దవేమొ పొలం పిచుక
ఊర పిచుకలు చిన్నవండి
కిటికీలు,చూరున పిచుక
వారెవ్వా గూడుకట్టు
గూటిలోన గుడ్లు పెట్టు !
తల్లి పిచుక పొదుగు చుండు
తండ్రి పిచుక తిండి తెచ్చు
బుల్లి పిచుకలొచ్చి చాల
గోల చేయ బువ్వ తెచ్చు
వారెవ్వా లార్వాలు
పిచ్చుకపిల్లల అప్పచ్చులు !
ఇల్లంతా ఒక సందడి
ఇంటివారికి శుభమగును
పిచ్చుకలు మనమిత్రులే
వేయుము కొన్ని గింజలను
వారెవ్వా చిన్ని ముక్కు
వడ్లు వొలిచే పని ముట్టు !
సెల్లు టవరు దాపురించె
పిచుకమ్మలు పారి పోయె
రేడియేషను ధాటికవి
పొలిమేరకు చేరిపోయె
వారెవ్వా మనిషి స్వార్థం
పర్యావరణముకు నష్టం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి