రెక్కల పిట్ట( బాల గేయం )-ఎడ్ల . లక్ష్మి సిద్దిపేట

రెక్కల పిట్ట వచ్చింది

టక్కున కింద వాలింది


ఒక్కొక్క ఈకా రాలంగా 

చక్కగా ఏరి పెట్టింది


చిట్టి పాపను పిలిచింది

ఈకలు తీసి చూపింది


ఒకటి రెండని చెప్పింది

అంకెలు పాపకు నేర్పింది


పిల్లల్లారా చూసారా

మీరు కూడా రారండీ


పిట్ట నేర్పే లెక్కలను

మీరు కూడా నేర్వండీ


నేర్చిన లెక్కలు చేయండి

గురువు మెప్పును పొందండి


పిట్టని చూసిన మీరంతా

చక్కని చదువులు చదవండి


ఊహల రెక్కలు విప్పండి

బ్రతుకు బాటలో ఎగరండీ


గమ్యం మీరు చేరండి

ఘణవిజయం పొందండి


కామెంట్‌లు