చిన్న చీమ (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
చిన్న చిన్న చీమమ్మ
చిన్న పాపను నేనమ్మ
నన్ను నీవు కుట్టొద్దు
చెప్పే మాట వినవమ్మ

అమ్మ వచ్చే చూడమ్మ
రవ్వలడ్డు తెచ్చింది
నీకు కొంచెం ఇస్తాను
బొజ్జ నిండా తినవమ్మ

వచ్చిన దారి పట్టమ్మ
చీమల గుంపు చేరమ్మ
ఎవరికి హాని చేయొద్దు
చిట్టి పొట్టి చీమమ్మ

ఎర్ర రంగు చీమమ్మ
పరుగు నీవు ఆపమ్మ
ఆగి ఆగి నడవమ్మ
చీమల పుట్ట చేరమ్మ