బోడిగుండు (బాల గేయం)-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
బోడిగుండు చూడురా
బొచ్చు లేని గుండురా
సమురంట పని లేదు
దువ్వెన అసలు వద్దురా

గుండ్రనైన కళ్లతోటి
గురిజ గింజ రంగులో
గోటీల రూపం బోలి
బెదురు గుడ్ల చూపుతో

నల్ల రంగు మీసాలు
కొట్టుకెళ్ళి తెచ్చాడు
అద్దములోచూసాడు
ముద్దు పెట్టుకున్నాడు

వెండి పల్లు రెండు జూడ
చుక్కలోలె మెరుపుతో
దగ దగ మెరుగుగా 
మోము అందమెంతో

ముద్ద ముఖం చూడగా
ముద్దు లొలుకు చుండెను
వాని రూపం చూసుకుని
కిల కిలా మని నవ్వేను