మోటార్ బైక్ -(బాల గేయం)-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
డుగు డుగు మోటార్ బైకు 
దీనిమీద ఎక్కితే  భలే షోకు 
చిటికెలో చేర్చు బజారు కు 
మస్తుగా డబ్బులు పెట్రోలుకు 

ఎండా వానకు కవరుండాలి 
సండే కైనా రెస్టివ్వాలి 
ఆర్నెల్ల కోసారి సర్వీసింగు 
అలవాటు పడాలి వాకింగు

చిన్నవయసుకే నడపొద్దు 
విన్యాసాలు చెయ్యొద్దు 
రోడ్డు భద్రత తెలిసే వరకూ 
సొంత బైకును అడగొద్దు!