చిన్నారి:-మంజీత--బెంగుళూరు
కల్మషం తెలియని పసివాళ్ళు
అమ్మానాన్నల పంచప్రాణాలు

మీ నవ్వులు మతాబులు
మీ మోములు గులాబీలు

కోపం వస్తే బుంగమూతి
అల్లరిలో మీరే కోతి

బామ్మలకు బంగారు కొండలు
తాతయ్యలకు మీరే వారసులు

టీవీ, ఫోన్ కు బానిస కావొద్దు
అబద్దాలు చెప్పొద్దు

చక్కగా చదువుకోవాలి
రాకెట్ లాగా దూసుకుపోవాలి

మీరే భావి భారతపౌరులు
వెలుగులు నింపే చిరు దివ్వెలు





కామెంట్‌లు