అహింస మనసు:-- యామిజాల జగదీశ్
 అతను పారసీక పాదుషా. పేరు నౌషేర్వాన్. వేటంటే మహా సరదా. ఇష్టమూ. 
ఓరోజు వేటకు వెళ్ళారు. దారిలో అతనో సంఘటన చూసాడు. 
ఒకడు రాళ్ళతో ఓ కుక్కను కొడుతున్నాడు.
దాని కాలు విరిగింది. అది కుంటిిదయింది.
ఆ సమయంలోనే పరుగున వచ్చిన ఓ గుర్రం కుక్కను రాళ్ళతో కొట్టిన అతనిని కిందకు నెట్టేసింది.
 
అతని కాలు విరిగింది. ఇంకేంచేస్తాడు. కుంటసాగాడు.
వేగంగా వచ్చిన గుర్రం నియంత్రించుకోలేక అక్కడున్న గోతిలో పడి దాని కాలు విరిగింది. అదీ కుంటసాగింది.
 ఒకటి తర్వాత ఒకటి జరిగిన ఈ మూడు సంఘటనలనూ అతను చూశాడు.
దేవుడు వెంట వెంటనే వారి వారికి తగిన శిక్ష విధించాడో కదా అనుకున్నాడు. అంతేకాదు, ఆరోజు నించీ అతను జంతువులను వేటాడటం మానేసాడు.
 అహింసను పాటించాడు. ఎవరినీ హింసించలేదు.
ఎవరైనా తప్పు చేసినా తగిన రీతిలో వారికి హితవు చెప్పి వారిలో మంచి మార్పు వచ్చేలా చేయడం మొదలుపెట్టాడు.