కాలం ఒడ్డు:-సి.యస్.రాంబాబు

ఆకాశంలో అగ్నివీణ 
అసిధారా వ్రతమేదో
చేస్తున్నట్టు 
భగభగల భానుడు 
అసహనంగా పైకొచ్చాడు

రాత్రిపూచిన కలల సౌరభం 
కరిగిపోగా 
వాస్తవాల వేడిగాలి 
ఎడారి కోయిలలా పలకరించింది

ఉక్కపోతలా వైఫల్యాలు ఉరుముతుంటాయి
పరిహసిస్తూ లక్ష్యాలన్నీ 
తరుముతుంటాయి
కాలాన్ని ఈది ఒడ్డు చేరాల్సిందే 

అగ్నిధారల నెలబాలుడు 
అంతలోనే సర్దుకుని 
ప్రయాణం మొదలెట్టినట్టు 
అసిధార వ్రతాన్ని అందిపుచ్చుకోవాలి


కామెంట్‌లు