నాటి పల్లెటూరి పనులు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పొయ్యి మీద వంటలు
మసి పట్టిన గిన్నెలు
చేద బావి చెంతన
గిన్నెలన్ని వేసినాది

కుండ నిండ నీళ్లు తోడి 
మట్టి పెట్టి రుద్దినాది
నీటి తోటి కడిగి వేసి
చుక్కలోలె మెరుగులు

అవ్వ చూసి మురిసి 
పక్క కేమో పెట్టి నాది
కట్టెల పొయ్యి మీద
కమ్మనైన వంటలు

నాడు పల్లెల్లో పనులు
చెమట చుక్కలోడగా
శ్రమకోర్చి పనులు చేసి
సంతోషంగున్నారు వారు



కామెంట్‌లు