రాజమౌళి! నిజామాబాద్ కు వెళ్తావు రా... అని, మా అక్క (పెద్ద నాన్న కూతురు) అడిగింది. ఎందుకు అక్క! అని నేను నేను అడుగగా... బావ రాక ఆరు నెలలు అవుతుంది. ఉత్తరం కూడా రాయటం లేదు రా.. అన్నది. సరే... అన్నాను. అప్పుడు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. అక్క 300 ఇవ్వగా నిజామాబాద్ కు బయలుదేరాను. అక్కన్నపేట వెళ్లి రైలు ద్వారా వెళ్లాను. రైలు ఎక్కడ ము అదే మొదటిసారి. కిటికీ దగ్గర కూర్చుని చూస్తుంటే చెట్టు వెనుకకు వెళుతున్నట్టు అద్భుతంగా అనిపించింది. గాలికి నిదుర పట్టిందో ఏమో... నిజామాబాద్.... నిజామాబాద్ అంటుంటే మెలకువ వచ్చింది. రైలు దిగేసరికి ఎదురుగా సినిమా టాకీస్... ఆ టాకీస్ లో భలే తమ్ముడు సినిమా నడుస్తుంది. బావ సంగతి మరిచిపోయాను. టికెట్ తీసుకుని టాకీస్ లో పడ్డాను. సినిమా బాగుంది. సినిమా అయిపోగానే బయటకు వచ్చి, మా బావ పని చేసే దగ్గరకు వెళ్లి బావ గురించి అడిగాను. ఆయనెప్పుడో.. వెళ్లాడని చెప్పారు. మళ్లీ సిద్దిపేటకు బయలుదేరాను. వచ్చేటప్పుడు అక్కన్నపేట నుండి రాగానే... వెళ్లేటప్పుడు కామారెడ్డి నుండి వెళ్ళాలనిపించింది. కామారెడ్డి బస్సు ఎక్కాను. మధ్య మధ్యన ఊర్లు చూస్తుండే సరికి కామారెడ్డి వచ్చింది. దిగగానే మళ్లీ సినిమా టాకీస్ కి వెళ్లాను. కీల గుర్రం సినిమా చూస్తున్నాను.... సెకండ్ షో కావడం వలన, సినిమా అయిపోయిన తర్వాత ఎక్కడ పండుకోవా లనో.. అని అని పక్క సీటు ఆయనను అడగగా.. ఆయన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఉదయం లేవగానే ముఖము కడుగుకొని చాయ్ తాగుదాం అనేసరికి.. సిద్దిపేట బస్సు వచ్చింది. సీటు కొరకు దస్తీ కిటికీ ద్వారా వేశాను. బస్సు ఎక్కేసరికి మా దస్తీ లేదు. దాని చివర పది రూపాయలు కట్టుకున్నాను. ఏడుస్తూ బస్సు దిగాను. దుకాణాలు తెరిచే వరకు ఎదురు చూశాను. దుకాణంలో జీతం ఉంటానని అని అడిగాను. ఎవరు ఉంచుకోలేదు. సాయంత్రం ఐదు వరకు ఏడుస్తూనే కూర్చున్నాను. బస్సులు వస్తున్నాయి. వెళ్తున్నాయి. మళ్లీ బస్సు వచ్చింది. టికెట్లు ఇచ్చి కండక్టరు, డ్రైవరు చాయ్ తాగావా వెళ్లారు. కిందిది ఒక టికెట్ తీసుకుని బాగా మడచి జేబులో పెట్టుకొని బస్సు ఎక్కి సీటులో కూర్చున్నాను. టికెట్ టికెట్ టికెట్ అంటూ కండక్టరు అంటుంటే... అందరూ తీసుకున్నట్టు తల ఊపారు. నేను తల ఊపాను. కండక్టర్ వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. సిద్దిపేట లో బస్సు దిగే వరకు ఒకటే గుటగుట... బస్సు దిగగానే పోయిన ప్రాణం తిరిగి ఇగ వచ్చినట్లు అయింది..
'రైలు ఎక్కాను'...:- ఎన్నవెళ్లి రాజమౌళి , కథల తాతయ్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి