తపమునకే పొంగిపోవు-దైవము నీవే!:-కిలపర్తి దాలినాయుడు
ఆ.వె.-1
మూడుకన్నులున్న -మురిపంపు మాస్వామి
వేడుకొందు చరిత-పాడుకొందు!
కీడుచేయువారి-క్రీడలనడచుము
వేడి కన్ను దెరచి-వ్రేటు వేసి!
కం.-2
శూలివి పాములు మెడలో
మాలగ నిరతముధరించు-మంజుల మూర్తీ!
సాలీడు,పాము,కరులను
లాలించియుమోక్షమిడిన-లాలితమూర్తీ!
కం.-3
గంగాధర!మాభూముల
వంగడములు వానలేక-పండవు మాకున్
భంగముకలుగకభంగ,త
రంగములువిడిచి శుభంక-రా కావుమయా!
తే.గీ-4
నీలకంధర! ప్లాస్టిక్కు-నేడుపెరిగి
విషము తోనిండెనీభూమి-విషమ నేత్ర
కాలకూటము చాలదు-గాలిచెడెను
దేవుడవునీవు రక్షింప-జీవులకును!
కం.-5
త్రిపురాంతక!మదనాంతక!!
విపులనుకాపాడు దుష్ట-వేదనలణచన్
కృపజూపు దేవుడందురు
తపమునకే పొంగిపోవు-దైవము నీవే!

*మహాశివుడు మిమ్మునెళ్ళవేళలా *
*చల్లగా*జూచుగాకా!
*శివరాత్రి శుభాకాంక్షలతో*