పిచ్చుక:- కె. సృజన సింధూర్
 పిచ్చుక మ్మ  ఓ పిచుకమ్మ
గొడవ ఎందుకమ్మా
ఎడ మొహం,పెడ మొహం
పెట్ట వద్దమ్మ
ఒకే కొమ్మ పై ,ఒకే గూటిలో 
ఉండాలమ్మ
ఒకే గింజ ఒకే ధాన్యం
తినాలమ్మా
పిచ్చుక మ్మ, పిచ్చుక మ్మ
నా మాట వినవామ్మా 
నా బుజ్జి తల్లివి కదమ్మా
ఇద్దరూ ఒకే మాట అనందే
ఇద్దరూ కాంప్రమైజ్ అవ్వందే
సంసారం ఎలా సాగునమ్మా
రెక్కలు రాని పిల్లల గతి ఏమితమ్మా
పిచ్చుక మ్మ ఓ పిచ్చుక మ్మ
కాస్త ప్రేమతో చూడు పిచుకయ్యను
తిండి లేక మోహమెలా పీక్కు పోయేనో
నిన్ను చూడక ఎలా నీరసించేనో
పిచ్చుక మ్మ ఓ పిచ్చుకయ్యా
కలిసి మెలసి ఒక్కటిగా ఉండండి
కలకాలం కాపురం చేసుకోండి.