నీతోడై,నీ నీడై
సదా నీ వెన్నంటి వుండేది
నేనున్నానని ప్రోత్సహించేది. నీలో విశ్వాసాన్ని నింపేది.
ధైర్యంగా నిన్ను ముందుకు నడిపంచేది.
నీవు చతికిల పడకుండా కాపాడేది.
నేనీపని చేయలేను నాతోనికాదు అని
నువ్వు నిరుత్సాహ పడ్డప్పుడు
నిన్ను వెన్నుతట‌్టి ప్రోత్సహించేది.
నీవేదైనా చేయగలవనే నమ్మకం
నీమీద నీకున్నప్పుడు ఏదీ నీపనికీ,
నీ గెలుపుకీ ఆటంకం కాదనీ
నీనమ్మకాన్ని నేనని చెప్పేది.
నీవేమిటో నీవు నిరూపించు కోవడానికి
అన్నివిధాలా సహకరించే నీ
దృఢసంకల్ప ఆయుధమే నీ ఆత్మ విశ్వాసం.
ఆత్మ విశ్వాసమెప్పుడూ కోల్పోకు.అది లేనినాడంతా శూన్యమే.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి