ఊగిసలాట:- కె. సృజన్ సింధూర్
 ఆశా నిరాశ ల
పోరాటమే జీవితం
సుఖ దుఃఖాల
దేవులాటే జీవితం
గెలుపు ఓటముల
కవ్వింపే జీవితం
ఎత్తు పల్లాల
సయ్యా టే జీవితం
కలిమి లేముల 
కలయికే జీవితం
ప్రేమలు ద్వేషాలు
కల బోతే జీవితం
పడటం లేవటం
తోలు బొమ్మలాటె జీవితం
చావు బతుకుల
ఊగిసలాటె జీవితం.