-యాడవరo చంద్రకాంత్ గౌడ్ - తెలుగు పండిట్. సిద్దిపేట-9441762105

  స్నేహమoటే ఇదేరా
పెద్దగుండవెల్లి లో పాతికేళ్ల క్రితం పదవ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులందరూ ఇటీవలే సెల్ఫోన్ పుణ్యమా అని  వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు .అందరo కలుద్దాం అని తేదీ నిర్ణయించు కున్నారు. ఇలా అందరం
 కలుసుకోవాలని నిర్ణయించడం, ఫోన్ నెంబర్లు సేకరించడంలో ముందు వరుస రాజేష్ ది.
అందరూ ఇక ఆత్మీయ నేస్తాలను కలుసుకునే రోజు కోసం రోజులు లెక్కపెడుతూ ఉన్నారు .పాతికేళ్ల తర్వాత ఒకే దగ్గర ముచ్చటించే  రోజు రానే వచ్చింది .ఆరోజు ఉదయం 10 గంటలకు గ్రామ దేవత ఎల్లమ్మ గుడి దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేయించాడు రాజేష్. అనుకున్న సమయానికి పూర్వ విద్యార్థులు అందరూ వచ్చారు.
పాతికేళ్ల తర్వాత మిత్రులందరూ ఒక దగ్గర కలుసుకోవడం ,ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించు కొంటూ సంతోషపడిపోయా రు .ఆ రోజు నిజంగా ఒక సందడి గా మారిపోయింది పాతికేళ్ల క్రితం క్లాస్ రూమ్ లో బెంచీ మీద కూర్చున్నట్లే, ఈ రోజు కూడా అలానే కుర్చీలో కూర్చుని ఒకరి కుటుంబం గురించి ఒకరు చెప్పుకోవడం అందరి సంతోషాలకి అవధులు లేకుండా పోయింది.
ఇక పలకరింపులు పూర్తయ్యాక కార్యక్రమం 10 గంటలకు ప్రారంభమైంది .అందులో స్కూల్లో ముందు బెంచీలో కూర్చున్న  శేఖరం ఇప్పుడు తెలుగు టీచర్ .కాబట్టి ఈ కార్యక్రమాన్ని నడిపించాలనీ ఆహ్వానించాడు రాజేష్. శేఖరం కాదనలేక వేదిక ముందు నిలబడి 5 నిమిషాల్లో తమతమ పాతికేళ్ళ ప్రస్థానం చెప్పాలని మిత్రులను వినమ్రంగా వేడుకున్నాడు.
ఒక్కొక్కరుగా తమ తమ జీవిత విశేషాలను చెబుతూ ఉంటే ఆనందం వెలకట్టలేని గా అనిపించింది .సమయం అందరికీ తెలియకుండానే గడిచి పోయింది .మధ్యాహ్నం భోజన సమయం అయింది. తిరిగి రెండు గంటలకు కార్యక్రమం కొనసాగిద్దాం అనుకున్నారు .భోజనాలు చక్కగా ఆరగించారు. పసందైన రుచికరమైన వంటకాలు అందించడంలో ముందున్న రాజేష్ కు ధన్యవాదాలు చెప్పారు అందరూ.
భోజనాలు అయ్యాక రెండు గంటలకు మళ్లీ కార్యక్రమం ప్రారంభమైంది .తమ చిన్ననాటి ప్రియనేస్తం రాజయ్య కూలిపని చేస్తూ బతుకుతున్నాడు అని తెలిసింది .అతని ఆరోగ్యం క్షీణించిందని ,లివర్ పూర్తిగా చెడిపోయిందని తెలిసి బాధపడిపోయారు. మరి మన చిన్ననాటి మిత్రునికి మనం ఏ విధంగా సహాయ పడగలo అని తోటి మిత్రుడు లచ్చన్న అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్కసారిగా మిత్రులందరి లో నిశ్శబ్దం. తమ ఆత్మీయ నేస్తానికి ఇలాంటి కష్టం వచ్చింది అని బాధపడుతూ క్లాస్మేట్స్ అందరూ తమ తమ పర్సనల్ లో ఎంత ఉంటే అంతా ఒక దగ్గర పోగు చేయగా , దాదాపు 50 వేల రూపాయలు అయ్యాయి. ఈ కార్యక్రమం 5 గంటలకు ముగిసింది మిత్రులు అందరూ కలిసి మిత్రుడు రాజయ్య ఇంటికి  వెళ్లి అతన్ని పరామర్శించి, నీకు మేమున్నామని భరోసా కల్పించి తమకు తోచిన సహాయం అందించారు.
 అప్పుడు రాజయ్య కళ్ళల్లో ఆనందబాష్పాలు. పాతికేళ్ల క్రితం చదువుకున్న మిత్రుని కోసం అందరూ కలిసికట్టుగా సహాయం చేయడానికి రావడం గొప్ప విషయమని తన చూపులతోనే ఆత్మీయ నేస్తాల కు ధన్యవాదాలు తెలిపాడు.
ఇక మిత్రులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు తమ చిన్ననాటి ఆత్మీయ నేస్తాల కు ఏ కష్టమొచ్చినా అండగా నిలుస్తామని అంతేకాకుండా "మిత్రబృందం సహాయ నిధి" ఏర్పాటు చేశారు .ఇప్పుడు ఏ మిత్రుడు ఆపదలో ఉన్న మిత్రులు స్పందించి సహాయం అందిస్తున్నారు.
నీతి: ఆపదలో ఆదుకున్న వారే నిజమైన మిత్రులు


కామెంట్‌లు