*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౭౨ - 72)

 కందము :
*తటతట లేటికి చేసెదు*
*కటకట పరమాత్మ నీవు | ఘంటాకర్ణున్*
*ఎటువలె నిపుణుని జేసితి*
*వటువలె రక్షింపుమయ్య | యచ్యుత కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
కృష్ణా! నీవు నాశనము లేనివాడివి. నా మీద బెదరింపులు ఎందుకు చేస్తావయ్యా.  కష్టాలు తీర్చగల పరమాత్ముడవు నీవు.  ఘంటాకర్ణుడు అనేవానిని నైపుణ్యం గలవాననిగా చేసావు కదా, కుబ్జోద్ధారకా.  అదేవిధంగా నన్ను కూడా రక్షించు, సత్యభామా వల్లభా!.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*తన శరీర ఆకృతితో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న కుబ్జను వుద్ధరించావు,కదా కంసారి.  ఈ విధంగా నీ వల్ల రక్షించబడినవారిని ఎంతమంది గురించి నీకు గుర్తు చేయగలిగిన వారు ఎవరున్నారు, స్వామీ.  విజ్ఞులవల్లే కాకపోతే, మూఢుడను నేనెంత.  రక్ష రక్ష పరమాత్మా! రక్ష రక్ష జగదీశా!! అంతా నీవే! అన్నీ నీవే,అంబరదేహా!!*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు