*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౮౧ - 81)

 కందము :
*చూపుము నీ రూపంబును*
*పాపపు దుష్కృతములెల్ల | పంకజనాభా*
*పాపుము నాకును దయతో*
*శ్రీపతి నిను నమ్మినాడ | సిద్ధము  కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
తామర పువ్వు బొడ్డునందు కలవాడా, ఓ కృష్ణమూర్తీ! నీ చక్కని ఆనంద కరమైన రూపాన్ని నాకు చూపించు దేవా!   నేను ఎన్నో పాపపు పనులు, చెడ్డపనులు చేసాను. లక్ష్మీ దేవి భర్తవైన శ్రీమన్నారాయణా, దయతో  నన్ను కాపాడి రక్షించు స్వామి. నిన్నే నమ్మి వున్నాను, పరంధామ.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*ప్రపంచాన్ని నీలోనే దాచుకున్న పరమేష్ఠి, సకల సృష్టి కీ నీవే సంవర్ధకుడివి, నీవే లయకారకుడవు.  లక్ష్మీ దేవికి భర్తవూ నీవె.  అంతటి నీవు దయతో కరుణ చూపించు.  ఎన్నో పాపాలను, అధర్మాలను చేసిన వాణ్ణి నేను.  నిన్నే నమ్మి వున్నాను. నా తప్పులను కాచి, నన్ను వుద్ధరించు, దేవదేవా.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు