బాలగేయం (చమత్కారం): --మమత ఐల-హైదరాబాద్-9247593432
పండుగ వలె వచ్చింది
సెలవులెన్నొతెచ్చింది
కుటుంబాన్ని ఒకటి చేసి
సంతోషం నింపింది

క్రోవి 19 ముచ్చట
కోట్ల జనము నేలింది
మానవత్వ బంధాలను
మంచిగ నిలబెట్టింది

సంప్రదాయ ములనన్ని
వెలుగు లోకి తెచ్చింది
వినకుంటె తాను ఉన్నానని
చెప్పకనే చెబుతోంది

సక్యతగా వంట పనిన
సాయపడే పతిదేవుని
పరాచకము లాడమని
పక్కున నవ్వేస్తుంది


కామెంట్‌లు