పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్-9247593432

 అంశం:-గురువు
కం
గురువర్యుల సన్నిధిలో
కరువే లేనంత దొరుకు ఘనమగు విద్యా
గురువును చులకన చేయని
సరియగు విద్యార్థి జ్ఞాన సంపద పొందున్
అంశం:- నవ్వు
కం
నవ్వించుట యోగమనిరి
నవ్వడమే భోగమనుచు నలుగురు చెప్పన్
నవ్వు నెపుడుదాచకుమా!
నవ్వక నపరాదివవకు నలుగురి యెదుటన్
కం
నవ్వడమారోగ్యమ్మట
నవ్వడమానందమైన నౌరా యనగా
నవ్వుము చింతలకెముడై
నవ్వుతు మార్గంబుచూపు నలుగురి కెపుడున్
అంశం:-కరోనా
కం
మాయమ్మ కరోనామణి
గాయమ్మును చేసి నిట్టి ఘనకార్యములన్
కాయంబున్నంతవరకు
మాయము కానియ్యమమ్మ మా పద్దతులన్
కం
ఎవరికివారేకాకని
సవినయముగ దెలుపుచున్న సాక్షి కరోనా
చవిజూసిరి జనులందరు
భవసాగర బాధ మరిచి వసుధన నిన్నే


కామెంట్‌లు